Breaking News

Ind vs Eng: చరిత్ర సృష్టించిన అశూ- జడ్డూ.. ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Published on Thu, 01/25/2024 - 15:14

India vs England, 1st Test Day 1: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా స్పిన్‌ ద్వయం రవిచంద్రన్‌ అశ్విన్‌- రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన భారత బౌలింగ్‌ జోడీగా ఘనత సాధించారు.

ఈ క్రమంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజ జంట అనిల్‌ కుంబ్లే- హర్భజన్‌ సింగ్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

246 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌
ఇందులో భాగంగా హైదరాబాద్‌ వేదికగా గురువారం మొదలైన తొలి టెస్టులో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను 246 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు, రవీంద్ర జడేజా మూడు, అక్షర్‌ పటేల్‌ రెండు, జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు వికెట్లు తీశారు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆటలో అశూ- జడ్డూ మొదటి రోజు ఆటలో మొత్తం కలిపి ఆరు వికెట్లు తీశారు. దీంతో ఇప్పటి వరకు టెస్టుల్లో ఇద్దరూ కలిపి 505 వికెట్లు సంయుక్తంగా తమ ఖాతాలో వేసుకున్నారు. 

కుంబ్లే- భజ్జీ రికార్డు బద్దలు
తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలింగ్‌ జోడీగా నిలిచారు. అంతకు ముందు ఈ రికార్డు కుంబ్లే- హర్భజన్‌ (501) పేరిట ఉండేది. ఇక ఈ జాబితాలో హర్భజన్‌ సింగ్‌- జహీర్‌ ఖాన్‌ జోడీ(474), ఉమేశ్‌ యాదవ్‌- అశ్విన్‌ జంట(431) నాలుగో స్థానంలో ఉంది. 

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లు జాక్‌ క్రాలే(20), బెన్‌ డకెట్‌(35), మార్క్‌వుడ్‌(11) వికెట్లను అశూ పడగొట్టగా.. ఒలీ పోప్‌(1), జో రూట్‌(29), టామ్‌ హార్ట్లే వికెట్లను జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు.  

తుదిజట్లు:
టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్‌, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్‌
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్ (వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ టామ్‌ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)