Breaking News

Rohit Sharma: మరో 'ఆరేస్తే' క్రికెట్‌ చరిత్రలోనే మొట్టమొదటి ఆటగాడవుతాడు..!

Published on Tue, 03/05/2024 - 14:46

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ మరో ఆరు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో 594 సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఉన్నాయి. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ తర్వాతి స్థానంలో విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ ఉన్నాడు. గేల్‌ ఖాతాలో 553 సిక్సర్లు ఉన్నాయి. గేల్‌ తర్వాత షాహిద్‌ అఫ్రిది (476), మార్టిన్‌ గప్తిల్‌ (398), ధోని (383), జయసూర్య (359), ఇయాన్‌ మోర్గన్‌ (352), ఏబీ డివిలియర్స్‌ (346), జోస్‌ బట్లర్‌ (328) వరుసగా టాప్‌ 10 స్థానాల్లో ఉన్నారు. 

హిట్‌మ్యాన్‌ ముంగిట మరో రికార్డు..
ధర్మశాల టెస్ట్‌లో రోహిత్‌ శర్మ మరో సిక్సర్‌ కొడితే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. 

కాగా, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్ట్‌ మ్యాచ్‌ నామమాత్రం సాగనుంది. సిరీస్‌ వరకు ఇది అప్రధానమైన మ్యాచే అయినప్పటికీ... వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 దృష్ట్యా కీలకం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ల సేవలు కోల్పోయినప్పటికీ.. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)