Breaking News

టీమిండియాతో ఐదో టెస్ట్‌.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

Published on Wed, 03/06/2024 - 14:24

ధర్మశాల వేదికగా టీమిండియాతో రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టు ఇవాళ ప్రకటించారు. ఇంగ్లండ్‌ తమ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో ఒకే ఒక మార్పు చేసింది. నాలుగో టెస్ట్‌లో ఆడిన ఓలీ రాబిన్సన్‌ స్థానంలో మార్క్‌ వుడ్‌ తుది జట్టులోకి వచ్చాడు. ధర్మశాల పిచ్‌ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇంగ్లండ్‌ అదనపు పేసర్‌ను బరిలోకి దించుతుందని అంతా ఊహించారు.

అయితే ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ పేసర్‌ స్థానంలో మరో పేసర్‌కే అవకాశం ఇచ్చింది. మొత్తంగా ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ టీమ్‌ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. మార్క్‌ వుడ్‌తో పాటు వెటరన్‌ పేసర్‌ జిమ్మీ ఆండర్సన్‌ బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా టామ్‌ హార్ట్లీ, షోయబ్‌ బషీర్‌ తుది జట్టుకు ఎంపికయ్యారు. రాబిన్సన్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వుడ్‌.. ప్రస్తుత సిరీస్‌లో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు.

హైదరాబాద్‌, రాజ్‌కోట్‌ మ్యాచ్‌ల్లో ఆడిన వుడ్‌ ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చకపోవడంతో నాలుగో టెస్ట్‌కు ఎంపిక కాలేదు. ఈ రెండు  మ్యాచ్‌ల్లో వుడ్‌ 55.5 సగటున కేవలం​ 4 వికెట్లు మాత్రమే తీశాడు. రాబిన్సన్‌ విషమానికొస్తే.. ఈ సిరీస్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన అతను పేలవ ‍ప్రదర్శన కనబర్చి తుది జట్టులో (ఐదో టెస్ట్‌) స్థానం​ కోల్పోయాడు. ఈ సిరీస్‌లో నాలుగో టెస్ట్‌ ఆడిన రాబిన్సన్‌ కేవలం 13 ఓవర్లు మాత్రమే వేసి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు.

ఆ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రాబిన్సన్‌కు బౌలింగ్‌ కూడా ఇవ్వలేదు. నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 

ధర్మశాల టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)