Breaking News

అయ్యో పాపం.. స్పిన్‌ వలలో చిక్కి క్లీన్‌బౌల్డ్‌! ఐదేసిన కుల్దీప్‌

Published on Thu, 03/07/2024 - 13:34

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చైనామన్‌ స్పిన్నర్‌ దెబ్బకు ఇంగ్లిష్‌ జట్టు టాపార్డర్‌ కుదేలైంది. కాగా ధర్మశాల వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య తాజా సిరీస్‌లో ఆఖరిదైన మ్యాచ్‌ గురువారం మొదలైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో 18వ ఓవర్‌ ఆఖరి బంతికి ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ రూపంలో ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అతడు ఇచ్చిన క్యాచ్‌ను శుబ్‌మన్‌ గిల్‌ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్‌ వెనుదిరిగాడు.

అయితే, మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలే మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి జతైన వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌(11)ను మాత్రం కుల్దీప్‌ త్వరగానే పెవిలియన్‌కు పంపగలిగాడు. 25.3వ ఓవర్లో పోప్‌ స్టంపౌట్‌ కావడంతో కుల్దీప్‌నకు రెండో వికెట్‌ దక్కింది.

ఆ తర్వాత జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న క్రాలే అర్థ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. అయితే, కుల్దీప్‌ మరోసారి తన స్పిన్‌ మాయాజాలంతో దెబ్బకొట్టి క్రాలే(79)ను బౌల్డ్‌ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 

ఇలా టాపార్డర్‌లో మూడు వికెట్లను తానే దక్కించుకున్న కుల్దీప్‌ యాదవ్‌.. ఇంగ్లండ్‌ వందో టెస్టు వీరుడు జానీ బెయిర్‌ స్టో(29) వికెట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అనంతరం బెన్‌ స్టోక్స్‌(0) రూపంలో ఐదో వికెట్‌ను కూడా దక్కించుకున్నాడు. కుల్దీప్‌ స్పిన్‌ మ్యాజిక్‌కు ఇంగ్లండ్‌ బ్యాటర్లు అవుటైన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు