Breaking News

చరిత్ర సృష్టించిన కుల్దీప్‌.. భారత తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు

Published on Thu, 03/07/2024 - 14:30

టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఆఖరి టెస్టు ఆరంభమైంది.

ధర్మశాలలోని హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ అదరగొడుతున్నాడు. బెన్‌ డకెట్‌(27), జాక్‌ క్రాలే(79), ఒలీ పోప్‌(11) రూపంలో టాపార్డర్‌ వికెట్లన్నీ తానే దక్కించుకున్న కుల్దీప్‌.. మిడిలార్డర్‌ బ్యాటర్లు జానీ బెయిర్‌ స్టో(29), బెన్‌ స్టోక్స్‌(0)లను కూడా అవుట్‌ చేశాడు.

కాగా స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపిన సందర్భంగా కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌లను ఈ చైనామన్‌ బౌలర్‌ అధిగమించాడు.

అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్‌ యాదవ్‌.. ఈ మార్కుకు చేరుకున్న పదిహేడో భారత బౌలర్‌గా నిలిచాడు.

తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 50 వికెట్ల మార్కు అందుకున్న భారత బౌలర్లు
1871 - కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)
2205 - అక్షర్‌ పటేల్‌(Axar Patel)
2520 - జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)