Breaking News

#Ash: వారెవ్వా.. 4.2 ఓవర్లలోనే మూడు వికెట్లు..

Published on Sat, 03/09/2024 - 11:40

టీమిండియా వెటరన్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వందో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు సందర్భంగా ఈ అరుదైన మైలురాయికి చేరుకున్న అశూ.. ధర్మశాలలో తన స్పిన్‌ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌.. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గింగిరాలు తిరిగే బంతితో ప్రత్యర్థి జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.

శనివారం మొదలైన మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా 477 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో అశ్విన్‌ ఆరంభం(1.5 ఓవర్‌)లోనే ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(2)ను బౌల్డ్‌ చేశాడు. 

అనంతరం మరో ఓపెనర్ జాక్‌‌ క్రాలే(1- 5.3వ ఓవర్‌ వద్ద)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒలీ పోప్‌(19- 9.2 ఓవర్‌ వద్ద) రూపంలో మూడో వికెట్‌ కూడా తానే దక్కించుకుని టాపార్డర్‌ పతనాన్ని శాసించాడు ఈ చెన్నై బౌలర్‌.

ఓవరాల్‌గా శనివారం నాటి ఆటలో తన బౌలింగ్‌లో వేసిన 4.2 ఓవర్లలోనే అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో  కుల్దీప్‌ యాదవ్‌ జానీ బెయిర్‌ స్టో(39) రూపంలో నాలుగో వికెట్‌ దక్కించుకోగా.. బెన్‌ స్టోక్స్‌ను అవుట్‌ చేసి ఐదో వికెట్‌ను అశ్విన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్‌ 103 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లంచ్‌ బ్రేక్‌కు ముందు అశూకు నాలుగు వికెట్లు దక్కగా.. కుల్దీప్‌ ఒక వికెట్‌ తీశాడు. ఇక టీమిండియా కంటే ఇంగ్లండ్‌ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)