Breaking News

IND VS ENG 5th Test Day 2: 15 ఏళ్లలో తొలిసారి..!

Published on Fri, 03/08/2024 - 16:06

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 102 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 433/8గా ఉంది. యశస్వి (57), రోహిత్‌ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్‌ (110), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (65), సర్ఫరాజ్‌ ఖాన్‌ (56), రవీంద్ర జడేజా (15), దృవ్‌ జురెల్‌ (15), అశ్విన్‌ (0) ఔట్‌ కాగా.. కుల్దీప్‌ (6), బుమ్రా (0) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 215 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 4 వికెట్లు పడగొట్టగా.. టామ్‌ హార్ట్లీ 2, ఆండర్సన్‌, స్టోక్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అంతకుముందు ఇంగ్లండ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్‌ 27, పోప్‌ 11, రూట్‌ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్‌ 0, ఫోక్స్‌ 24, హార్ట్లీ 6, వుడ్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

15 ఏళ్లలో తొలిసారి..
భారత తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు టపార్డర్‌ బ్యాటర్లు 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు (యశస్వి (57), రోహిత్‌ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్‌ (110), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (65), సర్ఫరాజ్‌ ఖాన్‌ (56)) నమోదు చేశారు. భారత్‌కు సంబంధించి టెస్ట్‌ క్రికెట్‌లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. 1998లో తొలిసారి ఐదుగురు భారత టాపార్డర్‌ బ్యాటర్లు 50 ప్లస్‌ స్కోర్లు నమోదు చేశారు. 

కోల్‌కతా వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఆసీస్‌పై ఈ అరుదైన ఫీట్‌ నమోదైంది. ఆతర్వాత 1999లో ఓసారి (మొహాలీలో న్యూజిలాండ్‌పై), ఆతర్వాత 2009లో ముంబై వేదికగా శ్రీలంకపై మరోసారి భారత టాపార్డర్‌ బ్యాటర్లు ప్రతాపం చూపించారు. తిరిగి 15 ఏళ్ల తర్వాత మరోసారి భారత టాపార్డర్‌లోని ఐదుగురు బ్యాటర్లు 50 ప్లస్‌ స్కోర్లు నమోదు చేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)