Breaking News

IND VS ENG 5th T20: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

Published on Sun, 02/02/2025 - 22:12

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా (Team India) మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్‌.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో (Bilateral Series) అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్‌ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్‌ పేసర్‌ జేసన్‌ హోల్డర్‌ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్‌ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో హోల్డర్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ కూడా సాధించాడు.

ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్‌ బౌలర్‌ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్‌ సోధి (న్యూజిలాండ్‌) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్‌ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.

ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. 

భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. బ్యాటింగ్‌లో చెలరేగిన అభిషేక్‌ బౌలింగ్‌లోన సత్తా చాటి 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

ప్రస్తుత సిరీస్‌లో వరుణ్‌ ప్రదర్శనలు..
తొలి టీ20-3/23 (ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌)
రెండో టీ20-2/38
మూడో టీ20-5/24 (ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌)
నాలుగో టీ20-2/28
ఐదో టీ20-2/25
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి