Breaking News

ఐదేసిన అశ్విన్‌.. టీమిండియాను ఊరిస్తున్న విజయం

Published on Sun, 02/25/2024 - 17:11

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ మరో 152 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. రోహిత్‌ శర్మ (24), యశస్వి జైస్వాల్‌ (16) క్రీజ్‌లో ఉండగా.. భారత్‌ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. 

అంతకుముందు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్‌ (5/51), కుల్దీప్‌ (4/22) ధాటికి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్‌ (17), డకెట్‌ (15), రూట్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్‌ 0, స్టోక్స్‌ 4, హార్ట్లీ 7, రాబిన్సన్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులకే ఔటయ్యారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రూట్‌ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్‌ (58), జాక్‌ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్‌ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ (73), దృవ్‌ జురెల్‌ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్‌ బషీర్‌ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.  


 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)