Breaking News

IND VS ENG 4th Test: ఇంగ్లండ్‌ను మడతపెట్టిన అశ్విన్‌

Published on Sun, 02/25/2024 - 16:25

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చెలరేగిపోయాడు. యాష్‌ (5/51).. ఇంగ్లండ్‌ను సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే మడతపెట్టాడు. అశ్విన్‌కు కుల్దీప్‌ యాదవ్‌ (4/22) తోడవ్వడంతో ఇంగ్లండ్‌ కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది.

రవీంద్ర జడేజా ఓ వికెట్‌ పడగొట్టాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్‌ (17), డకెట్‌ (15), రూట్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్‌ 0, స్టోక్స్‌ 4, హార్ట్లీ 7, రాబిన్సన్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌ కలుపుకుని ఇంగ్లండ్‌ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రూట్‌ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్‌ (58), జాక్‌ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్‌ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ (73), దృవ్‌ జురెల్‌ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్‌ బషీర్‌ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)