Breaking News

చరిత్ర సృష్టించిన దృవ్‌ జురెల్‌

Published on Tue, 02/27/2024 - 19:46

టీమిండియా నయా సంచలనం దృవ్‌ జురెల్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాంచీ టెస్ట్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకోవడం ద్వారా అరంగేట్రం సిరీస్‌లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జురెల్‌కు ముందు భారత వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అజయ్‌ రాత్రా ఈ ఘనత సాధించాడు. 2002 వెస్టిండీస్‌ పర్యటనలో రాత్రా.. తన డెబ్యూ సిరీస్‌లోనే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

జురెల్‌ అరంగేట్రం సిరీస్‌ రెండో మ్యాచ్‌లో ఈ అవార్డు అందుకుంటే.. రాత్రా తన డెబ్యూ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆంటిగ్వా వేదికగా విండీస్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో రాత్రా సెంచరీ (115) చేసి ఈ అవార్డును దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే, ఆ సెంచరీ తర్వాత రాత్రా కనీసం ఒక్కసారి కూడా హాఫ్‌ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. రాత్రా ఆ ఘనత సాధించిన 22 ఏళ్ల తర్వాత జురెల్‌ మరోసారి ఆ ఫీట్‌ను రిపీట్‌ చేశాడు. 

ఓవరాల్‌గా చూస్తే.. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో కేవలం ఆరుగురు మాత్రమే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులను గెలుచుకున్నారు. వీరిలో ఎంఎస్‌ ధోని, రిషబ్‌ పంత్‌ రెండు సార్లు ఈ ఘనతను సాధించగా.. నయన్‌ మోంగియా, వృద్దిమాన్‌ సాహా, అజయ్‌ రాత్రా, దృవ్‌ జురెల్‌ చెరోసారి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచారు. కాగా, రాంచీ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో అజేయమైన 39 పరుగులు చేసి జురెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనలో (192) తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. జురెల్‌, శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)