Breaking News

IND VS ENG 4th Test: కుంబ్లే రికార్డును సమం చేసిన అశ్విన్‌

Published on Sun, 02/25/2024 - 17:54

రాంచీ టెస్ట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డులను కొల్లగొడుతున్నాడు. తొలుత భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల (5/51) ప్రదర్శన అనంతరం కుంబ్లే పేరిట ఉండిన అ‍త్యధిక ఐదు వికెట్ల ఘనతల రికార్డును (భారత్‌ తరఫున) సమం చేశాడు. 

కుంబ్లే 132 టెస్ట్‌ల్లో 35 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేస్తే.. అశ్విన్‌ కేవలం 99 టెస్ట్‌ల్లోనే ఈ ఘనతను (35 ఐదు వికెట్ల ఘనతలు) సమం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేసిన రికార్డు స్పిన్‌ దిగ్గజం మురళీథరన్‌ పేరిట ఉంది.

మురళీ 133 టెస్ట్‌ల్లో ఏకంగా 67 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనల రికార్డు స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ (145 టెస్ట్‌ల్లో 37 సార్లు) పేరిట ఉంది. వార్న్‌ తర్వాతి స్థానంలో రిచర్డ్‌ హ్యాడ్లీ (86 మ్యాచ్‌ల్లో 36 సార్లు) ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ తొలుత బద్దలుకొట్టిన రికార్డు (భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు) కూడా కుంబ్లే పేరిట ఉండినదే కావడం విశేషం. భారత్‌లో కుంబ్లే 350 వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. అశ్విన్‌ ఐదేయడంతో (5/51) ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలి భారత్‌ ముందు 192 పరుగుల  స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అశ్విన్‌తో పాటు కుల్దీప్‌ (4/22) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసి లక్ష్యానికి మరో 152 పరుగుల దూరంలో ఉంది. రోహిత్‌ శర్మ (24), యశస్వి జైస్వాల్‌ (16) క్రీజ్‌లో ఉండగా.. భారత్‌ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్‌ (17), డకెట్‌ (15), రూట్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్‌ 0, స్టోక్స్‌ 4, హార్ట్లీ 7, రాబిన్సన్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులకే ఔటయ్యారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రూట్‌ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్‌ (58), జాక్‌ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్‌ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్‌ 3, సిరాజ్‌ 2, అశ్విన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ (73), దృవ్‌ జురెల్‌ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్‌ బషీర్‌ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)