Breaking News

టీమిండియా చెత్త రికార్డు.. జింబాబ్వే సరసన చోటు

Published on Thu, 06/26/2025 - 16:51

ఇంగ్లండ్‌ చేతిలో తొలి టెస్ట్‌లో (హెడింగ్లే) ఓడిన టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఇందులో ప్రధానమైనవి రెండున్నాయి. మొదటిది.. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఐదు సెంచరీలు చేసినా టీమిండియా ఓటమిపాలవ్వడం​. రెండోది.. టీమిండియా హ్యాట్రిక్‌ పరాజయాలు (టెస్ట్‌ల్లో) సహా చివరి 9 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్‌ గెలవడం. 

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో టీమిండియాకు ముందు జింబాబ్వే మాత్రమే ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌ లాంటి చిన్న జట్లు కూడా వారాడిన చివరి 9 మ్యాచ్‌ల్లో కనీసం రెండైనా గెలిచాయి. సౌతాఫ్రికా అయితే టెంబా బవుమా సారథ్యంలో చివరి 9 మ్యాచ్‌ల్లో ఏకంగా ఎనిమిదింట గెలిచింది.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జింబాబ్వే చివరి 9 మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచినా, రెండు మ్యాచ్‌లు డ్రా అయినా చేసుకుంది. ఆరింట మాత్రమే ఓడింది. టీమిండియా అయితే ఒకటి గెలిచి, మరో మ్యాచ్‌ మాత్రమే డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట ఓటమిపాలైంది. ఈ లెక్కన భారత్‌ను జింబాబ్వే సరసన అనడానికి కూడా వీళ్లేదు.

డ్రా అయినా చేసుకోవాల్సింది..!
తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత్‌ కనీసం డ్రా అయినా చేసుకొని ఉండాల్సింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి నుంచి ఓటమిని కొని తెచ్చుకుంది. ఆటగాళ్ల స్వయంకృతాపరాధాలే భారత్‌ ఓటమికి కారణం. బౌలర్ల వైఫల్యం,  ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడచడం టీమిండియా కొంపముంచాయి.

ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత​ బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు.

ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్‌ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. జైస్వాల్‌ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్‌ డకెట్‌ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్ట్‌ జులై 2 నుంచి బర్మింగ్హమ్‌ వేదికగా జరుగనుంది.

టీమిండియా చివరిగా ఆడిన 9 టెస్ట్‌ల వివరాలు..
ఇంగ్లండ్‌తో- ఓటమి (టెండూల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ 2025)
ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25)
ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25)
ఆస్ట్రేలియాతో-డ్రా (బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25)
ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25)
ఆస్ట్రేలియాతో-విజయం (బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25)
న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ 2024)
న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ 2024)
న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ 2024)

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)