Breaking News

Ind vs Ban: దుమ్ములేపిన పంత్‌.. దంచికొట్టిన హార్దిక్‌ పాండ్యా

Published on Sat, 06/01/2024 - 21:48

టీమిండియా తరఫున ‘రీ ఎంట్రీ’లో రిషభ్‌ పంత్‌ దుమ్ములేపాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత బ్లూ జెర్సీ ధరించిన పంత్‌ పొట్టి ఫార్మాట్లో దుమ్ములేపాడు. టీ20 ప్రపంచకప్‌-2024 సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 32 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 పరుగులు సాధించాడు. అర్ధ శతకంతో మెరిసి రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

కాగా న్యూయార్క్‌ వేదికగా నసావూ కౌంటీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సంజూ శాంసన్‌ ఓపెనింగ్‌ చేశాడు.

రోహిత్ 19 బంతుల్లో 23 పరుగులు చేసి నిష్క్రమించగా.. సంజూ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషభ్‌ పంత్‌ 53 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ 18 బంతుల్లో 31 పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఇక శివం దూబే మాత్రం 16 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులే చేసి నిరాశపరిచాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్యా మాత్రం 23 బంతుల్లో 40 పరుగులతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా(4)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 

ఈ క్రమంలో 20 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షోరిఫుల్‌ ఇస్లాం, మెహదీ హసన్‌, మహ్మదుల్లా, తన్వీర్‌ ఇస్లాం ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)