Breaking News

రిస్క్‌ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్‌

Published on Tue, 10/01/2024 - 15:30

కాన్పూర్‌ టెస్టులో ప్రణాళికలు పక్కాగా అమలు చేయడం వల్లే విజయం సాధ్యమైందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. నాలుగో రోజు ఆటలో రిస్క్‌ తీసుకున్న మాట వాస్తవమేనని.. అందుకు ప్రతిఫలంగా గెలుపు వరించిందని హర్షం వ్యక్తం చేశాడు. రెండున్నర రోజుల ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయినా.. సమిష్టి కృషితో అనుకన్న ఫలితం రాబట్టగలిగామని పేర్కొన్నాడు.

చివరి రెండు రోజుల్లో ఫలితం తేల్చి
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2022-25 సీజన్‌లో భాగంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించిన రోహిత్‌ సేన.. తాజాగా రెండో టెస్టులోనూ గెలుపు జెండా ఎగురువేసింది. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారినా.. చివరి రెండు రోజుల్లో టీమిండియా అద్భుత ప్రణాళికలతో విజయాన్ని సొంతం చేసుకుంది.

రిస్క్‌ అని తెలిసినా తప్పలేదు
తొలుత ప్రత్యర్థిని పడగొట్టి.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పరుగులు రాబట్టి.. ఆఖరికి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌పై 2-0తో క్లీన్‌స్వీప్‌ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘రెండున్నర రోజుల ఆట రద్దైపోయింది. అలాంటి సమయంలో నాలుగోరోజు పూర్తి స్థాయిలో ఆడే అవకాశం దక్కినపుడు రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడలేదు. ముందు వాళ్లను త్వరగా అవుట్‌ చేయాలి.

అతడొక అద్భుతం
ఆ తర్వాత త్వరత్వరగా బ్యాటింగ్‌ చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో 100- 150 పరుగులకే మేము ఆలౌట్‌ అయినా ఫర్వాలేదని భావించాం. ఫలితం తేల్చడమే లక్ష్యంగా ముందుకు సాగి సఫలమయ్యాము’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక బంగ్లాపై విజయంలో తన వంతు పాత్ర పోషించిన పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ అద్బుతం రోహిత్‌ శర్మ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.

నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్‌
‘‘అతడు బాగా బౌలింగ్‌ చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో చాన్నాళ్ల పాటు ఆడిన అనుభవం అతడికి ఉంది. మేనేజ్‌మెంట్‌ అతడి నుంచి ఏం ఆశించిందో అందుకు తగ్గట్లుగా రాణించాడు. నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్‌ అతడు. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్‌ చేయగల ఫిట్‌నెస్‌ అతడి సొంతం’’ అని రోహిత్‌ శర్మ ఆకాశ్‌ ప్రతిభను కొనియాడాడు. 

ఇక గాయాల వల్ల ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉంది.. కాబట్టి బెంచ్‌ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్‌ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఆకాశ్‌ దీప్‌ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)