Breaking News

బంగ్లాతో తొలి టెస్టు.. రోహిత్ మాస్ట‌ర్ ప్లాన్‌! ఇక చుక్కలే?

Published on Sun, 09/15/2024 - 12:37

బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ద‌మ‌వుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు సెప్టెంబ‌ర్ 19 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా ప్రారంభం కానుంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు చేరాలంటే ఈ సిరీస్ భార‌త్‌కు చాలా కీల‌కం. 

ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా తమ ప్రాక్టీస్‌ను కూడా షురూ చేసింది. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియాపై బంగ్లా జట్టు ఒక్క‌సారి కూడా  విజ‌యం సాధించకపోయినప్పటకి.. ఈ సిరీస్‌ను రోహిత్ సేన ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. పాక్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజ‌యం సాధించి స‌మ‌రోత్స‌హంతో భారత్ గడ్డపై అడుగు పెట్టనున్న బంగ్లా బెండు తీసేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.

రోహిత్ అండ్ గంభీర్ మాస్టర్ మైండ్‌..?
తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న చెపాక్ పిచ్‌ను పూర్తిగా పేస్‌కు అనుకూలించే విధంగా తయారు చేయమని టీమిండియా మెనెజ్‌మెంట్ పిచ్‌క్యూరేటర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. తొలి టెస్టు కోసం ఎర్ర నేల ఆధారిత ట్రాక్‌ను తయారు చేస్తున్నట్లు వినికిడి. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గరుండి పిచ్‌ను తయారు చేయిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

కాగా సాదారణంగా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ సోయిల్ పిచ్‌పై తొలి రోజు నుంచే బంతి టర్న్ అవుతూ ఉంటుంది. అందుకే స్పిన్నర్‌లు ఈ వేదికగా తమ మయాజాలం ప్రదర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు బంగ్లాను తమ పేస్ బౌలింగ్‌తో ముప్పు తిప్పలు పెట్టేందుకు భారత్ సిద్దమైనట్లు సమాచారం. 

బంగ్లాదేశ్ ఎక్కువగా బ్లాక్ సోయిల్‌(నల్ల నేల) పిచ్‌లపై ఎక్కువ ఆడుతోంది.  కాబట్టి  ఎర్ర నేల ట్రాక్‌పై ఆడేందుకు వారు కచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ క్రమంలోనే వారి వీక్‌నెస్‌పై భారత్ దెబ్బ కొట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: IND vs BAN: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)