Breaking News

ఉమేశ్‌ యాదవ్‌.. నీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

Published on Thu, 12/15/2022 - 16:25

చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. 278/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌..  మరో 126 పరుగులు జోడించి 404 పరుగుల వద్ద ఆలౌటైంది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (4/26), మహ్మద్‌ సిరాజ్‌ (3/14), ఉమేశ్‌ యాదవ్‌ (1/33) ధాటికి 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్‌.. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 291 పరుగులు వెనుకపడి ఉంది. మెహిది హసన్‌ (8), ఎబాదత్‌ హొస్సేన్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు.   

కాగా, పుజరా (90), శ్రేయస్‌ అయ్యర్‌ (86), అశ్విన్‌ (58)లు హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించింది. పంత్‌ (46), కుల్దీప్‌ యాదవ్‌ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్‌ యాదవ్‌ (15 నాటౌట్‌) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 393/9 స్కోర్‌ వద్ద అశ్విన్‌ ఔటయ్యాక బరిలోకి దిగిన ఉమేశ్‌.. మెహిది హసన్‌ బౌలింగ్‌లో 101 మీటర్ల రెండు భారీ సిక్సర్లు బాదాడు.

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు.. ఉమేశ్‌.. నీలో ఈ యాంగిల్‌ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2019 అక్టోబర్‌లో కూడా ఉమేశ్‌ ఇదే తరహాలో బ్యాట్‌తో రెచ్చిపోయాడు. నాడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 10 బంతుల్లో 31 పరుగులు పిండుకున్నాడు.   

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)