అత్యధిక పరుగుల వీరుడు.. సచిన్‌ తర్వాత స్థానం కోహ్లిదే!

Published on Sat, 10/25/2025 - 15:30

అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో విరాట్‌ కోహ్లి (Virat Kohli) తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) తర్వాత యాభై ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 

ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా.. కుమార్‌ సంగక్కరను అధిగమించి కోహ్లి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఆటగాడిగానూ కోహ్లి నిలిచాడు.

వరుసగా డకౌట్లు
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో డకౌట్‌ అయిన ఈ దిగ్గజ బ్యాటర్‌.. అడిలైడ్‌ వన్డేలోనూ ఇదే పునరావృతం చేశాడు. 

ఈ క్రమంలో భారీ అంచనాలు, ఒత్తిడి నడుమ సిడ్నీ వన్డే బరిలో దిగిన కోహ్లి వింటేజ్‌ కింగ్‌ను గుర్తు చేశాడు. నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించినా ఆ తర్వాత జోరు పెంచరీ అర్ధ శతకం సాధించాడు. వన్డే కెరీర్‌లో 75 హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.  మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

తొమ్మిది వికెట్ల తేడాతో భారత్‌ గెలుపు
శతకధీరుడు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (121 నాటౌట్‌)తో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సిడ్నీ వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌.. ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి క్లీన్‌స్వీప్‌ గండం నుంచి తప్పించుకుంది.

అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు
🏏సచిన్‌ టెండుల్కర్‌ (ఇండియా)- 452 ఇన్నింగ్స్‌లో 18426 పరుగులు
🏏విరాట్‌ కోహ్లి (ఇండియా)- 293* ఇన్నింగ్స్‌లో 14235 పరుగులు
🏏కుమార్‌ సంగక్కర (శ్రీలంక)- 380 ఇన్నింగ్స్‌లో 14234 పరుగులు
🏏రిక్కీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా)- 365 ఇన్నింగ్స్‌లో 13704 పరుగులు
🏏సనత్‌ జయసూర్య (శ్రీలంక)- 433 ఇన్నింగ్స్‌లో 13430 పరుగులు

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)