Breaking News

అనవాయితీని కొనసాగించిన సూర్యకుమార్‌.. రింకూ, జితేశ్‌లకు..!

Published on Mon, 12/04/2023 - 11:25

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్య​కుమార్‌ యాదవ్‌ టీమిండియా కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే విజయం సాధించి, దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. ట్రోఫీ గెలిచిన అనంతరం స్కై భారత కెప్టెన్లు ఆచరించిన ఆనవాయితీని కొనసాగించాడు.

ఇటీవలికాలంలో భారత్‌ సిరీస్‌ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్లు కొత్త ఆటగాళ్లకు ట్రోఫీని అందించడం​ ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని స్కై కూడా కొనసాగిస్తూ.. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మలకు ట్రోఫీని అందించాడు. టీమిండియాలో ఈ ఆనవాయితీని మహేంద్ర సింగ్‌ ధోని 2007లో ప్రవేశపెట్టాడు. నాటి నుంచి భారత్‌ ట్రోఫీ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్‌ ఎవరైనా ఈ ట్రెడిషన్‌ కొనసాగుతూనే ఉంది. 

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (డిసెంబర్‌ 3) జరిగిన నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్‌ చేసుకుని అద్భుత విజయం​ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 160 పరుగులు చేసిన భారత్‌.. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆసీస్‌ను నిలువరించగలిగింది.

ఆఖరి ఓవర్లో ఆసీస్‌ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో అర్షదీప్‌ సింగ్‌ మ్యాజిక్‌ చేశాడు. 6 బంతుల్లో వికెట్‌ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ సిరీస్‌లో ఆసీస్‌ కేవలం మూడో టీ20లో మాత్రమే విజయం సాధించగా.. భారత్‌ మిగిలిన మ్యాచ్‌లన్నిటిలో గెలుపొంది సిరీస్‌ కైవసం చేసుకుంది. 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)