Breaking News

IND VS AUS 4th Test: టీమిండియా 300కు పైగా లక్ష్యాన్ని ఛేదిస్తుందా..?

Published on Sun, 12/29/2024 - 12:25

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియా టీమిండియా ముందు 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఉంచనుంది. ప్రస్తుతం ఆ జట్టు 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో ఓ వికెట్‌ మాత్రమే ఉంది. నాథన్‌ లయోన్‌ (16), స్కాట్‌ బోలాండ్‌ (8) టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇవాళ మరో 16 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

ఛేజింగ్‌ విషయానికొస్తే.. మెల్‌బోర్న్‌ మైదానంలో గడిచిన 70 ఏళ్లలో ఛేజింగ్‌ చేసిన అత్యధిక స్కోర్‌ 258. ఆసీస్‌ ఇప్పటికే 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ 300 ప్లస్‌ టార్గెట్‌ను ఛేదిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్‌ విజయవంతంగా ఛేదించిన లక్ష్యాలను చూస్తే.. టీమిండియా కేవలం మూడు పర్యాయాలు మాత్రమే టెస్ట్‌ క్రికెట్‌లో 300 ప్లస్‌ స్కోర్‌ను ఛేదించింది. 1976లో వెస్టిండీస్‌పై 406 పరుగులు.. 2008లో ఇంగ్లండ్‌పై 387.. 2021లో ఆస్ట్రేలియాపై 329 పరుగుల లక్ష్యాలను విజయవంతగా భారత్‌ ఛేదించింది.

గణాంకాలు, గత చరిత్ర ఆధారంగా చూస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవడం అంత ఈజీ కాదు. ఏదైన అద్భుతం జరిగి భారత టాపార్డర్‌ ఇరగదీస్తే ఈ మ్యాచ్‌ టీమిండియా సొంతం అవుతుంది. పిచ్‌ కూడా చివరి రోజు బ్యాటర్లకు అంతగా అనుకూలించకపోవచ్చు. ఒకవేళ అనుకూలించినా 300 ప్లస్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేసేంత సీన్‌ ఉండకపోవచ్చు.

స్కోర్ల విషయానికొస్తే.. ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ (70) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్‌ 3, జడేజా ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 82, రోహిత్‌ శర్మ 3, కేఎల్‌ రాహుల్‌ 24, విరాట్‌ కోహ్లి 36, ఆకాశ్‌దీప్‌ 0, రిషబ్‌ పంత్‌ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్‌ రెడ్డి 114, వాషింగ్టన్‌ సుందర్‌ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌, లయోన్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు.

దీనికి ముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్‌ కొన్‌స్టాస్‌ (60), ఉస్మాన్‌ ఖ్వాజా (57), లబూషేన్‌ (72), కమిన్స్‌ (49), అలెక్స్‌ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2, సుందర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)