Breaking News

కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది!

Published on Sun, 03/12/2023 - 13:24

Virat Kohli Century India Vs Australia: రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. తనకిష్టమైన ఫార్మాట్లో.. తనకిష్టమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై శతకంతో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టులో ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

ఉద్వేగానికి లోనైన కోహ్లి
అహ్మదాబాద్‌లో నాలుగో రోజు ఆటలో భాగంగా 241 బంతుల్లో 100 పరుగులు స్కోరు చేసి దాదాపు 40 నెలలుగా ఊరిస్తున్న 28వ టెస్టు సెంచరీ సాధించాడు. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి టెస్టుల్లో కింగ్‌ కోహ్లి కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. ‌దీంతో స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో కోహ్లి బ్యాట్‌తో అభివాదం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.

వాళ్ల తర్వాత కోహ్లికే సాధ్యమైంది
కాగా ఆస్ట్రేలియాపై కోహ్లికి ఇది ఓవరాల్‌గా 16వ సెంచరీ. టెస్టుల్లో 8వది. ఈ క్రమంలో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ , ఆస్ట్రేలియా లెజెండ్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

ఒకే ప్రత్యర్థిపై అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు
సచిన్‌ టెండుల్కర్‌- ఆస్ట్రేలియా మీద- 20
డాన్‌ బ్రాడ్‌మన్‌- ఇంగ్లండ్‌ మీద- 19
సచిన్‌ టెండుల్కర్‌- శ్రీలంక మీద- 17
విరాట్‌ కోహ్లి- ఆస్ట్రేలియా మీద 16*
విరాట్‌ కోహ్లి- శ్రీలంక మీద- 16.

చదవండి:  WTC Final: టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక.. కివీస్‌ అద్భుతం చేస్తేనే..
Virat Kohli- Steve Smith: విరాట్‌ కెరీర్‌లో ఇదే తొలిసారి! కోహ్లి బ్యాట్‌ చెక్‌ చేసిన స్మిత్‌.. వైరల్‌
WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్‌!

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి