Breaking News

IND VS AUS 4th Test: గవాస్కర్‌కు పాదాభివందనం చేసిన నితీశ్‌ తండ్రి

Published on Sun, 12/29/2024 - 11:01

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి చేసిన సూపర్‌ సెంచరీకి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఫిదా అవుతుంది. సునీల్‌ గవాస్కర్‌, రవిశాస్త్రి లాంటి భారత క్రికెట్‌ దిగ్గజాలు నితీశ్‌ సూపర్‌ ఇన్నిం​గ్స్‌ను కొనియాడుతున్నారు. నితీశ్‌ సెంచరీ చూసి రవిశాస్త్రి కన్నీటిపర్యంతం కాగా.. గవాస్కర్‌ జేజేలు పలికాడు.

సాధారణంగా గవాస్కర్‌ ఏ ఆటగాడిని పెద్దగా పొగడడు. అలాంటిది సన్నీ నితీశ్‌ను పొగడటం చూస్తుంటే ఆశ్చర్యమేసింది. పొగడటమే కాదు.. నితీశ్‌ సెంచరీ అనంతరం గవాస్కర్‌  స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చాడు. భారత క్రికెట్‌ చరిత్రలో నితీశ్‌ సెంచరీ చిరకాలం గుర్తుండిపోతుందని కితాబిచ్చాడు.

గవాస్కర్.. నితీశ్‌ను ప్రశంశిస్తూనే ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసుంటారు. వాటిని నితీశ్‌ ఎప్పటికీ గుర్తించుకోవాలని సూచించారు. మూడో రోజు ఆట ముగిశాక నితీశ్‌ కుటుంబ సభ్యులు గవాస్కర్‌ను కలిశారు. 

ఈ సందర్భంగా నితీశ్ తల్లి, తండ్రి, సోదరి గవాస్కర్‌కు పాదాభివందనం చేశారు. నితీశ్‌ తండ్రి ముత్యాల రెడ్డి కాళ్లకు నమస్కారం చేస్తుండగా గవాస్కర్ వారించారు. అయినా ముత్యాల రెడ్డి వినలేదు. సార్.. మీరు గొప్ప క్రికెటర్ అంటూ సాష్టాంగపడ్డాడు. అనంతరం గవాస్కర్ ముత్యాల రెడ్డిని హత్తుకొని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య  నాలుగో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతుంది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 266 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కమిన్స్‌ (34), లయోన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 82, రోహిత్‌ శర్మ 3, కేఎల్‌ రాహుల్‌ 24, విరాట్‌ కోహ్లి 36, ఆకాశ్‌దీప్‌ 0, రిషబ్‌ పంత్‌ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్‌ రెడ్డి 114, వాషింగ్టన్‌ సుందర్‌ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌, లయోన్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు.

దీనికి ముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్‌ కొన్‌స్టాస్‌ (60), ఉస్మాన్‌ ఖ్వాజా (57), లబూషేన్‌ (72), కమిన్స్‌ (49), అలెక్స్‌ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2, సుందర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)