Breaking News

IND VS AUS 4t​h Test Day 4: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ

Published on Sun, 03/12/2023 - 17:38

91‍ పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో ఉస్మాన్‌ ఖ్వాజా (180) రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. భారత బ్యాటింగ్‌ సందర్భంగా అక్షర్‌ పటేల్‌ కొట్టిన సిక్సర్‌ను ఆపే ప్రయత్నంలో ఖ్వాజా గాయపడ్డాడని, అందుకే అతన్ని ఓపెనర్‌గా పంపలేదని ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ వివరణ ఇచ్చింది.

ఖ్వాజా గాయపడటంతో అతని స్థానంలో ట్రవిస్‌ హెడ్‌కు జోడీగా మాథ్యూ కుహ్నేమన్‌ బరిలోకి దిగాడు. ఖ్వాజా గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అతను చివరి రోజు ఆటలో బరిలోకి దిగుతాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ ఖ్వాజా గాయం పెద్దదై అతను బరిలోకి దిగలేకపోతే, ఆ ప్రభావం ఆసీస్‌పై భారీగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

10 మంది ఆటగాళ్లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే అది ఆసీస్‌ విజయావకాశాలను భారీ దెబ్బకొడుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా మిడిలార్డర్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగని విషయం తెలిసిందే.

186 పరుగుల వద్ద కోహ్లి ఔటవ్వగానే టీమిండియా 571/9 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిం‍ది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (3), మాథ్యూ కుహ్నేమన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో కోహ్లితో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (128) సెం‍చరీ చేయగా..  అక్షర్‌ పటేల్‌ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలతో కదం‍తొక్కగా.. అశ్విన్‌ 6 వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరిచాడు. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, కుహ్నేమన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

4 మ్యాచ్‌ల ఈ బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో మూడు మ్యాచ్‌ల అనంతరం భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్ట్‌లో భారత్‌ గెలిస్తే.. 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధిస్తుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)