Breaking News

IND Vs AUS 3rd Test: తీరు మార్చుకోని విరాట్‌ కోహ్లి..!

Published on Mon, 12/16/2024 - 08:21

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆలౌట్‌ చేసిన భారత్‌.. తమ ఇన్నింగ్స్‌ ప్రారంభించి పట్టుమని 10 ఓవర్లు కూడా ఆడకుండానే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. 

ఇన్నింగ్స్‌ తొలి బంతికే బౌండరీ బాది జోష్‌ మీద కనిపించిన యశస్వి జైస్వాల్‌ రెండో బంతికే స్టార్క్‌ పన్నిన పన్నాగానికి బలయ్యాడు. స్టార్క్‌ సంధించిన స్లో బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన యశస్వి షార్ట్‌ మిడ్‌వికెట్‌లో కాపు కాసిన మిచెల్‌ మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ కూడా అనవసరంగా వికెట్‌ పారేసుకున్నాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవల వెళ్తున్న బంతిని ఫ్లిక్‌ చేసి ఔటయ్యాడు. వాస్తవానికి ఈ బంతిని ఆడాల్సి అవసరం లేదు. వదిలేస్తే సరిపోయేది. కానీ గిల్‌ వెంటాడి మరీ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ గల్లీలో అద్భుతమైన క్యాచ్‌ పట్టుకున్నాడు. గిల్‌ ఇన్నింగ్స్‌ ఒక్క పరుగు వద్దే ముగిసింది. భారత్‌ ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్న విరాట్‌
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి చేసిన తప్పునే మరోసారి చేశాడు. ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ ఫ్లిక్‌ చేసి ఔటయ్యాడు. ఇటీవలికాలంలో ఇలాంటి బంతులను ఎదుర్కోవడంలో విరాట్‌ తరుచూ విఫలమవుతున్నాడు. 

విరాట్‌ ప్రతిసారి ఒకే తరహాలో ఔట్‌ కావడం చూసి అభిమానులు విసుగెత్తిపోతున్నారు. చేసిన తప్పునే ఎన్ని సార్లు చేస్తావు. నేర్చుకోవా అంటూ చురకలంటిస్తున్నారు. శరీరానికి దూరంగా వెళ్తున్న బంతులను డ్రైవ్‌ చేయాల్సిన అవసరమేముందంటూ తలంటుతున్నారు. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ పెవిలియన్‌ బాటపట్టాడు.

మొత్తానికి మూడో రోజు తొలి సెషన్‌లోనే భారత్‌ మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 423 పరుగులు వెనుకపడి ఉంది. కేఎల్‌ రాహుల్‌కు (13) జతగా రిషబ్‌ పంత్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. విరాట్‌ ఔట్‌ కాగానే వర్షం మొదలైంది. అంపైర్లు లంచ్‌ విరామాన్ని ప్రకటించారు.

అంతకుముందు ఆస్ట్రేలియా ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 40 పరుగులు జోడించి 445 పరుగుల వద్ద ఆలౌటైంది. అలెక్స్‌ క్యారీ 70 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో స్టీవ్‌ స్మిత్‌ (101), ట్రవిస్‌ హెడ్‌ (152) సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్‌ సిరాజ్ రెండు, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఆకాశ్‌దీప్‌‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)