Breaking News

టీమిండియాను ఉతికి 'ఆరే'సిన స్టార్క్‌

Published on Fri, 12/06/2024 - 15:04

అడిలైడ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్‌ 48 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణంకాలు గతంలో 6/50గా ఉండేవి. స్టార్క్‌ తన కెరీర్‌లో మొత్తం 15 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్‌ 350 వికెట్ల అరుదైన క్లబ్‌లో చేరాడు.

ఈ మ్యాచ్‌లో స్టార్క్‌ యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవిచంద్రన్‌ అశ్విన్‌, హర్షిత్‌ రాణా వికెట్లు తీశాడు. స్టార్క్‌ ఇన్నింగ్స్‌ తొలి బంతికే భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇలా టెస్ట్‌ల్లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీయడం స్టార్క్‌కు ఇది మూడో సారి. స్టార్క్‌కు ముందు విండీస్‌ బౌలర్‌ పెడ్రో కాలిన్స్‌ కూడా టెస్ట్‌ల్లో మూడు సార్లు ఇన్నింగ్స్‌ తొలి బం​తికే వికెట్‌ తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. స్టార్క్‌ దెబ్బకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్‌, బోలాండ్‌ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42), కేఎల్‌ రాహుల్‌ (37), శుభ్‌మన్‌ గిల్‌ (31), అశ్విన్‌ (22), రిషబ్‌ పంత్‌ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్‌ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్‌, హర్షిత్‌ రాణా, బుమ్రా డకౌట్‌ అయ్యారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)