Breaking News

బీస్ట్‌ ఈజ్‌ బ్యాక్‌.. పేస్‌తో గడగడలాడించి టీమిండియాకు చుక్కలు చూపించిన స్టార్క్‌

Published on Sun, 03/19/2023 - 16:44

గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఆస్ట్రేలియా పేసు గుర్రం మిచెల్‌ స్టార్క్‌ ఎట్టకేలకు ఫామ్‌లో వచ్చాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 జరుగనున్న భారత గడ్డపై స్టార్క్‌ మునుపటి తరహాలో రెచ్చిపోతున్నాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో ఏమంత ప్రభావం చూపించని స్టార్క్‌.. టీమిండియాతో వన్డే సిరీస్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులిచ్చి ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌లను ఔట్‌ చేసిన స్టార్క్‌.. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చిన స్టార్క్‌.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. స్టార్క్‌ స్పెల్‌లో ఓ మొయిడిన్‌ కూడా ఉంది.

ఈ మ్యాచ్‌లో ఫైఫర్‌ సాధించడంతో స్టార్క్‌ ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో అత్యధిక ఫైఫర్‌లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లసిత్‌ మలింగ (8)ను వెనక్కునెట్టి, బ్రెట్‌ లీ (9), షాహిద్‌ అఫ్రిది (9) సరసన చేరాడు. కెరీర్‌లో 109 వన్డేలు ఆడిన స్టార్క్‌ 9 ఫైఫర్‌ల సాయంతో 219 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక ఫైఫర్‌ల రికార్డు వకార్‌ యూనిస్‌ (13) పేరిట ఉంది. వకార్‌ తర్వాతి స్థానాల్లో ముత్తయ్య మురళీథరన్‌ (10), స్టార్క్‌ (9) ఉన్నారు. 

ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్‌ స్టార్క్‌ (5/53), సీన్‌ అబాట్‌ (3/23), నాథన్‌ ఇల్లీస్‌ (2/13) నిప్పులు చెరగడంతో భారత్‌ను 117 పరుగులకే ఆలౌట్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

Videos

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

మా నాయకుడు జగన్ అని గర్వంగా చెప్తాం రాచమల్లు గూస్ బంప్స్ కామెంట్స్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)