Breaking News

ఆసీస్‌తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..?

Published on Thu, 11/23/2023 - 13:50

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 23) తొలి మ్యాచ్‌ జరుగనుంది. వైజాగ్‌ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం​ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. మాథ్యూ వేడ్‌ ఆసీస్‌ కెప్టెన్‌గా బరిలో ఉంటాడు. 

ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆసీస్‌ సైతం పలువురు రెగ్యులర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, పేసర్లు స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్‌ వరల్డ్‌కప్‌ ముగిసిన అనంతరం స్వదేశానికి వెళ్లిపోయారు. 

వరల్డ్‌కప్‌ హీరోలు ట్రవిస్‌ హెడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా జట్టులో ఉన్నప్పటికీ వారు తొలి మ్యాచ్‌ ఆడకపోవచ్చు. ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ వారికి విశ్రాంతి కల్పించవచ్చు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను మాథ్యూ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌ ఆరంభించే అవకాశం ఉంది. ఇతర సభ్యులుగా మ్యాథ్యూ వేడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఆరోన్‌ హర్డీ, మార్కస్‌ స్టోయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, సీన్‌ అబాట్‌, నాథన్‌ ఇల్లిస్‌, జేసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

టీమిండియా విషయానికొస్తే.. ఓపెనింగ్‌ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఇషాన్‌ కిషన్‌తో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. వన్‌డౌన్‌లో తిలక్‌ వర్మ, ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, ఆర్షదీప్‌ సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌ బరిలోకి దిగుతారు. అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగాలనుకుంటే ఓ పేసర్‌ బదులు రుతురాజ్‌, యశస్విలలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)