Breaking News

IND VS AUS 1st T20: సెంచరీ కొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌

Published on Fri, 11/24/2023 - 12:03

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్‌ 23) జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న సూర్య భాయ్‌ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో స్కై అంతర్జాతీయ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 3 అంతకంటే కింది స్థానాల్లో వచ్చి 100 సిక్సర్లు (47 ఇన్నింగ్స్‌ల్లో) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విభాగంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ టాప్‌లో ఉన్నాడు. మోర్గాన్‌ 107 ఇన్నింగ్స్‌ల్లో 120 సిక్సర్లు బాదాడు. ఇతని తర్వాత ఈ విభాగంలో విరాట్‌ కోహ్లి (98 ఇన్నింగ్స్‌ల్లో 106 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (98 ఇన్నింగ్స్‌ల్లో 105) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా స్కై తన 51 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్‌లో 108 సిక్సర్లు బాదాడు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. జోష్‌ ఇంగ్లిస్‌ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్‌ (14 బంతుల్లో 22 నాటౌట్‌; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి