Breaking News

ఆసీస్‌తో తొలి వ‌న్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్..!

Published on Sun, 10/19/2025 - 07:23

భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్‌కు స‌మ‌యం అస‌న్న‌మైంది. పెర్త్ వేదిక‌గా ఆదివారం జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేలో ఇరు జ‌ట్లు అమీతుమీ తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాయి. శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలో టీమిండియా బ‌రిలోకి దిగ‌నుండ‌గా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడ‌నుంది.

అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్.

పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం..  ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.

అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామ‌మే అనే చెప్పుకోవాలి. కాబ‌ట్టి భార‌త్ ముగ్గురు పేస‌ర్లు, ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగే ఛాన్స్ ఉంది.

భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: ప్లే ఆఫ్స్‌కు చేరిన తెలుగు టైటాన్స్‌

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)