IND VS AUS 1st ODI: మంధన మరోసారి..!

Published on Tue, 02/24/2026 - 11:51

అంతర్జాతీయ క్రికెట్‌లో క్వీన్‌ స్మృతి మంధన పరుగుల ప్రవాహం ఫార్మాట్లకతీతంగా కొనసాగుతోంది. ఈ టీమిండియా స్టార్‌ ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో సత్తా చాటింది. ఇవాళ (ఫిబ్రవరి) బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ చేసిన మంధన.. దీనికి ముందు టీ20 సిరీస్‌ డిసైడర్‌ (మూడో టీ20)లో కూడా హాఫ్‌ సెంచరీతో మెరిసింది. తాజా హాఫ్‌ సెంచరీతో మంధన ఓ అరుదైన ఘనత సాధించింది.

ఆస్ట్రేలియాపై వన్డేల్లో 11 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన అతికొద్ది మందిలో ఒకరిగా నిలిచింది. ఆసియా ప్లేయర్ల వరకు తీసుకుంటే మంధననే ఆసీస్‌పై అత్యధిక వన్డే హాఫ్‌ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో మంధన 68 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఔటైంది. 

52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఆదుకుంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ ప్రతీక రావల్‌ (0) వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో మంధన.. షఫాలీ వర్మతో (4) రెండో వికెట్‌కు 25 పరుగులు.. జెమీమా రోడ్రిగ్స్‌తో (8) మూడో వికెట్‌కు 27 పరుగులు.. నాలుగో వికెట్‌కు హర్మన్‌తో కలిసి 48 పరుగులు జోడించింది.

33 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 140-5గా ఉంది. హర్మన్‌ప్రీత్‌ 32, రిచా ఘోష్‌ 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో మెగాన్‌ షట్‌, డార్సీ బ్రౌన్‌, ఆష్లే గార్డ్‌నర్‌, అలానా కింగ్‌, తహ్లియా మెక్‌గ్రాత్‌ తలో వికెట్‌ తీశారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జరుగుతుంది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)