Breaking News

వైభవ్ సూర్య‌వంశీ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా

Published on Sat, 06/28/2025 - 07:48

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌ను భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు ఘ‌నంగా ఆరంభించింది. హోవ్ వేదిక‌గా శుక్ర‌వారం ఇంగ్లండ్ అండ‌ర్‌-19 జ‌ట్టుతో జ‌రిగిన తొలి యూత్ వ‌న్డేలో 6 వికెట్ల తేడాతో భార‌త్ జయభేరి మోగించింది. ఈ విజ‌యంతో ఐదు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ ఇసాక్‌ మొహమ్మద్‌ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడగా... మిడిలార్డర్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తనయుడు రాకీ ఫ్లింటాఫ్‌ (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. భార‌త యువ బౌలర్లలో కనిష్క్ చౌహ‌న్‌ 3, హెనిల్‌ పటేల్, అంబ్రీశ్, మొహ్మద్‌ ఇనాన్‌ తలా 2 వికెట్లు తీశారు.

వైభవ్ విధ్వంసం..
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ కేవలం 24 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. భార‌త ఓపెన‌ర్, ఐపీఎల్‌ సరికొత్త సంచలనం వైభవ్‌ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 48 ప‌రుగులు చేశాడు.

కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో క‌లిసి తొలి వికెట్‌కు 71 ప‌రుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలోనే వీళ్లిద్దరు అవుటైనప్పటికీ అభిజ్ఞాన్ కుండు (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కుదురుగా ఆడటంతో ఏ ఇబ్బంది లేకుండా యువభారత్‌ గెలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫ్రెంచ్‌ 2 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య ఈ నెల 30న రెండో వన్డే నార్తాంప్టన్‌లో జరుగుతుంది.
చదవండి: అది ఆసీస్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)