Breaking News

ఆసీస్‌తో మూడో టెస్టు: పాక్‌ తుది జట్టు ప్రకటన.. షాహిన్‌కు నో ఛాన్స్‌

Published on Tue, 01/02/2024 - 13:38

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో తలపడేందుకు పాకిస్తాన్‌ సిద్దమైంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు తమ తుది జట్టును పాకిస్తాన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది దూరమయ్యాడు.

గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్‌ ఆడుతున్న అఫ్రిదికి మేనెజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు  తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌పై వేటుపడింది. అతడి స్ధానంలో యువ ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.

అదే విధంగా మరో యువ పేసర్‌ సాజిద్ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టెస్టు సిరీస్‌ అనంతరం 5 టీ20ల సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది.  ఈ సిరీస్‌లో పాక్‌ జట్టును అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు.

ఆసీస్‌తో మూడో టెస్టుకు పాక్‌ జట్టు: సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్‌), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), సల్మాన్ అలీ అఘా, సాజిద్ ఖాన్, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్.
చదవండి: Petra Kvitova: అభిమానులకు శుభవార్త చెప్పిన టెన్నిస్‌ స్టార్‌.. ఆటకు దూరం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)