Breaking News

‘ధోని, రోహిత్‌లకే చోటు.. కోహ్లిని అమ్మేస్తాను’

Published on Tue, 09/24/2024 - 17:17

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్‌ టోర్నీ. ఐపీఎల్‌లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే కాసుల వర్షం కురవడం ఖాయం. ఇంతటి ఖ్యాతి ఉన్న పొట్టి లీగ్‌లో.. కెప్టెన్లుగా ఇప్పటికే తమ జట్లను ఐదుసార్లు చాంపియన్లుగా నిలిపిన ఘనత టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని(చెన్నై సూపర్‌ కింగ్స్‌), రోహిత్‌ శర్మ(ముంబై ఇండియన్స్‌)ల సొంతం.

ముగ్గురు లెజెండ్స్‌ ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడితే 
కానీ.. మరో స్టార్‌, భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి మాత్రం ఐపీఎల్‌ ట్రోఫీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఈ ముగ్గురు మేటి క్రికెటర్లలో ధోని 2008 నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌తోనే ఉండగా.. కోహ్లి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రోహిత్‌ మాత్రం ఆరంభంలో దక్కన్‌ చార్జర్స్‌కు ఆడినా.. తర్వాత ముంబై ఇండియన్స్‌లో చేరాడు.

ఇదిలా ఉంటే... ఈ ముగ్గురు లెజెండ్స్‌ ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది? ముగ్గురిలో ‌ఒకరిని మాత్రమే తుదిజట్టులోకి తీసుకోవాలనే నిబంధన ఉంటే?.. ఇలాంటి క్రేజీ ప్రశ్నే ఎదురైంది ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌, ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌లకు ఎదురైంది. ఇందుకు మైకేల్‌ వాన్‌ ఇచ్చిన సమాధానం వైరల్‌ అవుతోంది.

ధోనిని ఆడిస్తాను.. కెప్టెన్‌గా
‘‘నేనైతే ఎంఎస్‌ ధోనిని ఆడిస్తాను. అతడి కంటే మెరుగైన ఆటగాడు మరొకరు ఉండరు. అంతేకాదు నా జట్టుకు ధోనినే కెప్టెన్‌. విరాట్‌కు నా జట్టులో స్థానం ఉండదు. అతడిని వేరే జట్టుకు అమ్మేస్తాను. ఎందుకంటే అతడు ఒక్కసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. 

రోహిత్‌ ఓవరాల్‌గా ఆరుసార్లు గెలిచాడు. ధోనికి ఐదు ట్రోఫీలు ఉన్నాయి. కాబట్టి ధోనిని ఆడించి.. రోహిత్‌ను అతడికి సబ్‌స్టిట్యూట్‌గా పెడతా. విరాట్‌కు మాత్రం చోటివ్వను’’ అని మైకేల్‌ వాన్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.
 చదవండి: టీమిండియాకు అతడే కీలకం.. ఆ ఒక్కడిని కట్టడి చేస్తే: కమిన్స్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)