Breaking News

నేనే గనుక హార్దిక్‌ స్థానంలో ఉంటే?.. ఈపాటికి..

Published on Tue, 07/23/2024 - 15:17

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడమే మంచిదైందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ విజేతగా నిలిచిన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించగా.. అనూహ్యంగా సూర్యకుమార్‌ యాదవ్‌ను భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. ఫిట్‌నెస్‌ సమస్యల నేపథ్యంలోనే హార్దిక్‌ను కాదని, సూర్యకు పగ్గాలు ఇచ్చినట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టం చేశాడు.

ఈ విషయంపై భారత మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రాబిన్‌ ఊతప్ప స్పందించాడు. తాను గనుక హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఉంటే.. ఈపాటికి సంతోషంతో ఎగిరి గంతేసేవాడినని పేర్కొన్నాడు. కెరీర్‌ పొడిగించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని అభిప్రాయపడ్డాడు.

‘‘నేను హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఉంటే.. నా గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని సంతోషించేవాడిని. ఎందుకంటే.. భారత క్రికెట్ ఎకోసిస్టమ్‌లో ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అత్యంత అరుదుగా లభించే ఆటగాడు.

ఒకవేళ నాకు 34- 35 ఏళ్ల వయసు ఉండి.. తరచూ గాయాల బారిన పడుతూ ఉంటే కెరీర్‌ ప్రమాదంలో పడుతుంది. అదే ముందు నుంచీ జాగ్రత్తగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. మరికొంత కాలం ఆటలో కొనసాగవచ్చు.

జాతీయ జట్టుకు సేవలు అందించవచ్చు. కాబట్టి కెప్టెన్సీకి దూరంగా ఉండమన్నా ఆనందంగా సరేనంటాను’’ అని రాబిన్‌ ఊతప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా జూలై 27 నుంచి టీమిండియా- శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌ మొదలుకానుంది. ఈ పర్యటనలో టీమిండియా కొత్త కోచ్‌గా గౌతం గంభీర్‌ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్‌ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగనున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)