Breaking News

IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్‌ రికార్డు బ్రేక్‌ చేసేవాడు!

Published on Sat, 11/30/2024 - 20:42

ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఫిలిప్‌ హ్యూస్‌ గనుక బతికి ఉంటే ఐపీఎల్‌ వేలంలో కోట్లు కొల్లగొట్టేవాడని.. కానీ తను ఇప్పుడు ఈ లోకంలో లేడంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సౌదీ అరేబియాలో ఇటీవల ఐపీఎల్‌-2025 మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే.

అమాంతం ఏడు కోట్లు పెంచి
ఇందులో భాగంగా రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీకి రాగా.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ కళ్లు చెదిరే మొత్తానికి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. పంత్‌ ధర రూ. 20 కోట్లకు చేరినపుడు ఢిల్లీ రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ద్వారా పంత్‌ను తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచేసింది.

దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో రూ. 27 కోట్లకు రిషభ్‌ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్‌ రికార్డు సాధించాడు. ఈ నేపథ్యంలో లక్నో జట్టు హెడ్‌కోచ్‌, ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ జస్టిన్‌ లాంగర్‌ ‘ది వెస్ట్‌ ఆస్ట్రేలియన్‌’కు రాసిన కాలమ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్‌ చరిత్ర సృష్టించాడు. మా ఫ్రాంఛైజీ.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతడి సేవల కోసం ఐదు మిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేసింది. కేవలం ఎనిమిది వారాలకు ఇంత మొత్తం అంటే మాటలు కాదు.

అతడే గనుక బతికి ఉంటే
ఒకవేళ హ్యూస్‌ గనుక బతికి ఉంటే.. ఐపీఎల్‌ వేలంలో అతడు కూడా భారీ ధర పలికేవాడు. కేవలం తన డైనమిక్‌ బ్యాటింగ్‌ మాత్రమే ఇందుకు కారణం కాదు.. తనలోని ఎనర్జీ కూడా ఇందుకు కారణం. కానీ.. విచారకరం ఏమిటంటే.. తను ఇప్పుడు మన మధ్యలేడు. ఎప్పటికీ వేలంలోకి రాలేడు’’ అంటూ ఆసీస్‌ దివంగత స్టార్‌ ఫిలిప్‌ హ్యూస్‌ను గుర్తుచేసుకున్నాడు. 

అదే విధంగా.. పంత్‌ క్రికెటింగ్‌ నైపుణ్యాలను కొనియాడిన లాంగర్‌.. ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా(2020-21)ను ఒంటిచేత్తో గెలిపించిన తీరు ఎన్నటికీ మరువలేనిదన్నాడు. కాగా 2014లో ఫిలిప్‌ హ్యూస్‌ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లాడు. ఆసీస్‌ దేశీ టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌లో భాగంగా న్యూ సౌత్‌వేల్స్‌- సౌత్‌ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. 

సీన్‌ అబాట్‌ వేసిన రాకాసి బంతి బలైన హ్యూస్‌
ఆసీస్‌ బౌలర్‌ సీన్‌ అబాట్‌ వేసిన రాకాసి బంతి హ్యూస్‌ మెడకు బలంగా తాకడంతో అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. నవంబరు 27న హ్యూస్‌ పదో వర్ధంతి జరిగింది. ఈ నేపథ్యంలో అతడిని తలచుకుంటూ జస్టిన్‌ లాంగర్‌ ఉద్వేగానికి గురయ్యాడు.

కాగా న్యూ సౌత్‌ వేల్స్‌లో జన్మించిన హ్యూస్‌ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 26 టెస్టులు, 25 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1535, 826 పరుగులు చేశాడు. తన 26వ పుట్టినరోజు కంటే మూడు రోజుల ముందు.. క్రికెట్‌ ఆడుతూ తుదిశ్వాస విడిచాడు. 

చదవండి: ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్‌.. ‘హైబ్రిడ్‌ మోడల్‌’కు ఓకే!.. కానీ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)