Breaking News

T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్‌!

Published on Sun, 04/28/2024 - 11:28

టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మే 1ని డెడ్‌లైన్‌గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ విజేత యువరాజ్‌ సింగ్‌.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్‌ కీపర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

పోటీలో ఆ నలుగురు!
కాగా ప్రపంచకప్‌ జట్టులో బెర్తు కోసం రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తిక్‌ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్‌-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు.

ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో ‍కలిపి 195.52 స్ట్రైక్‌రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్‌ క్రికెట్‌లో అడుగుపెట్టినా.. ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు.

ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో మూడు హాఫ్‌ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా రాణిస్తూ.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

డీకే అవసరమా?
ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్‌ రాహుల్‌ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్‌కప్‌లో అతడు రాణించలేకపోయాడు.

కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)