Breaking News

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు ఘోర అవమానం

Published on Mon, 01/09/2023 - 11:23

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు ఘోర అవమానం జరిగింది. క్రికెట్‌ ఐస్‌లాండ్‌ (సీఐ).. తాజాగా ప్రకటించిన పాకిస్తాన్‌ ఆల్‌టైమ్‌ వన్డే టీమ్‌లో బాబర్‌ పేరును డ్రింక్స్‌ బాయ్స్‌ జాబితాలో చేర్చింది. బాబార్‌తో పాటు మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌ పేర్లను కూడా క్రికెట్‌ ఐస్‌లాండ్‌ డ్రింక్స్‌ బాయ్స్‌ జాబితాలో చేర్చింది.

ఈ జట్టులో ఓపెనర్లుగా సయీద్‌ అన్వర్‌, జహీర్‌ అబ్బాస్‌లకు స్థానం కల్పించిన క్రికెట్‌ ఐస్‌లాండ్‌.. వన్‌డౌన్‌లో ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌, నాలుగో స్థానంలో జావిద్‌ మియాందాద్‌, ఐదో ప్లేస్‌లో మహ్మద్‌ యూసఫ్‌, ఆరో స్థానంలో ఇమ్రాన్‌ ఖాన్‌, ఏడో స్థానంలో షాహిద్‌ అఫ్రిది, ఆతర్వాత మొయిన్‌ ఖాన్‌ (వికెట్‌కీపర్‌), పేస్‌ బౌలర్ల కోటాలో వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, ఏకైక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా సక్లయిన్‌ ముస్తాక్‌లను ఎంపిక చేసింది.

క్రికెట్‌ ఐస్‌లాండ్‌.. ఈ జట్టుకు కెప్టెన్‌గా పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్‌ ఐస్‌లాండ్‌ కొద్ది గంటల ముందు (జనవరి 8) తమ అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

కాగా, బాబర్‌ ఆజమ్‌ సారధ్యంలోని పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌ చేతిలో టెస్ట్‌ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన బాబర్‌ సేన.. ఆతర్వాత స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను అతికష్టం మీద 0-0తో డ్రా చేసుకోగలిగింది.

ఈ సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల దాకా వచ్చిన పాక్‌ అతికష్టం మీద బయటపడగలిగింది. స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాక్‌ అభిమానులు బాబర్‌ ఆజమ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. బాబర్‌.. కేవలం రికార్డుల కోసమే మ్యాచ్‌లు ఆడతాడు, జట్టు జయాపజాలతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తాడని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఐస్‌లాండ్‌ బాబర్‌ను డ్రింక్స్‌ బాయ్‌గా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.  
 

Videos

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

కాళ్లకు రాడ్డులు వేశారన్న వినకుండా.. కన్నీరు పెట్టుకున్న తెనాలి పోలీసు బాధితుల తల్లిదండ్రులు

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)