ఉ‍త్కంఠ పోరులో టీమిండియా ఓటమి

Published on Wed, 06/10/2026 - 19:12

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్‌ 10) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. భారత్‌ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

భారత్‌ను గెలిపించేందుకు రిచా ఘోష్‌ (36 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ప్రయోజనం​ లేకుండా పోయింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. శ్రీచరణి తొలి బంతికి సింగిల్‌ తీసి రిచాకు స్ట్రయిక్‌ ఇచ్చింది. అప్పటికే జోష్‌లో ఉన్న రిచా.. రెండో బంతిని బౌండరీకి, మూడో బంతిని సిక్సర్‌కు తరలించి భారత్‌ను గెలుపు వాకిటి వరకు చేర్చింది.

అయితే తొందరగా మ్యాచ్‌ను ముగిద్దామనే క్రమంలో నాలుగో బంతికి లిండ్సే స్మిత్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యింది. అప్పటికీ భారత్‌కు గెలిచే అవకాశం ఉండింది. మిగిలిన రెండు బంతుల్లో ఆరు పరుగులు సాధిస్తే టీమిండియాదే గెలుపు. చేతిలో ఓ వికెట్‌ ఉండింది. అయితే ఐదో బంతికి రేణుకా సింగ్‌ కూడా ఔట్‌ కావడంతో భారత్‌ ఆలౌటై, మ్యాచ్‌ను చేజార్చుకుంది.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్‌ (64), కెప్టెన​ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో డేనియెలా గిబ్సన్‌ (30 నాటౌట్‌) బ్యాట్‌ను ఝులిపించింది. మిగతా ప్లేయర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ 2, షఫాలీ, రేణుకా, శ్రీ చరణి, రాధా యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

భారత ఇన్నింగ్స్‌ విషయానికొస్తే.. రిచా మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేదు. షఫాలీ (13), యస్తికా (15), హర్మన్‌ (17), భారతి (18), రాధా యాదవ్‌ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లిన్సే స్మిత్‌ 3, డీన్‌, కోల్‌మన్‌, గిబ్సన్‌ తలో 2, వాంగ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

కాగా, ఈ ప్రపంచకప్‌ రెగ్యులర్‌ మ్యాచ్‌లు జూర్‌ 12 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-శ్రీలంక తలపడనున్నాయి. భారత్‌ జూన్‌ 14న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)