Breaking News

‘టాప్‌’ ర్యాంక్‌లోనే స్మృతి

Published on Wed, 09/24/2025 - 04:22

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ స్మృతి మంధాన అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో 300 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన స్మృతి మొత్తం 818 ర్యాంకింగ్‌ పాయింట్లతో తన నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. స్మృతి, రెండో స్థానంలో ఉన్న నాట్‌ సివర్‌ బ్రంట్‌ (ఇంగ్లండ్‌; 731) మధ్య రేటింగ్‌ పాయింట్లలో భారీ అంతరం ఉండటం విశేషం.

భారత్‌తో మూడో వన్డేలో శతకం బాదిన బెత్‌ మూనీ (ఆ్రస్టేలియా) రెండు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరుకుంది. టాప్‌–10లో భారత్‌ నుంచి స్మృతి మినహా ఎవరూ లేకపోగా... కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్‌కు పడిపోయింది. వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్‌ దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 5వ ర్యాంక్‌కు చేరుకుంది. 

భారత్‌ నుంచి టాప్‌–10లో మరెవరూ లేకపోగా... స్నేహ్‌ రాణా 16వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఈ జాబితాలో సోఫియా ఎకెల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), యాష్లే గార్డ్‌నర్‌ (ఆ్రస్టేలియా), మేగన్‌ షుట్‌ (ఆ్రస్టేలియా) వరుసగా తమ టాప్‌–3 ర్యాంక్‌లు నిలబెట్టుకున్నారు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా దీప్తి శర్మ (4వ స్థానం)కు టాప్‌–10లో చోటు లభించింది. 

#

Tags : 1

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు