విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..
Breaking News
World Cup 2022: భారత్‌కు తప్పని ఓటమి.. న్యూజిలాండ్ ఘన విజయం
Published on Thu, 03/10/2022 - 13:39
ICC Women ODI World Cup 2022 Ind W Vs Nz W: న్యూజిలాండ్ చేతిలో భారత మహిళా జట్టుకు మరోసారి పరాభవం తప్పలేదు. గత రికార్డులను కొనసాగిస్తూ న్యూజిలాండ్ మహిళా జట్టు భారత్ మీద అద్భుత విజయం సాధించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా న్యూజిలాండ్‌లోని సెడాన్ పార్కు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయంతో జోరు మీదున్న వైట్ ఫెర్న్స్ సంబరాలు అంబరాన్నంటాయి.
గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించకపోయినా.. అమీలియా కెర్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఇన్నింగ్స్ గాడిన పడింది.
ఆ తర్వాత అమీ సాటర్త్‌వైట్ 75 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. వీరికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ కేటే మార్టిన్ కూడా 41 పరుగులు సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి వైట్ ఫెర్న్స్ 260 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన మిథాలీ రాజ్ బృందానికి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులు, కెప్టెన్ మిథాలీ రాజ్ 31 పరుగులు తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు
న్యూజిలాండ్- 260/9 (50)
భారత్- 198 (46.4)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అమీ సాటర్త్‌వైట్(న్యూజిలాండ్)
చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే!
Tags : 1