చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి శతకం

Published on Tue, 01/28/2025 - 13:44

ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2025లో భారత ఓపెనర్‌ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌ రికార్డు నెలకొల్పింది. 

స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 

ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్‌ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.

19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌తో పాటు రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలింగ్‌ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. 

సెమీస్‌లో భారత్‌
గ్రూప్‌ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్‌ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్‌.. స్కాట్లాండ్‌ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్‌-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. 

కనీసం మూడంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయాయి..!
ఈ టోర్నీలో భారత్‌తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్‌ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్‌ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి.

టీ20 వరల్డ్‌కప్‌లో తొలి శతకం

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)