Breaking News

ICC Awards: రేసులో పాకిస్తాన్‌ కెప్టెన్‌

Published on Tue, 06/06/2023 - 19:26

2023 మే నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ (జూన్‌ 6) ప్రకటించింది. గడిచిన నెలలో వన్డేల్లో ప్రదర్శన ఆధారంగా నామినీస్‌ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. పురుషులతో పాటు మహిళల క్రికెట్‌ నుంచి చెరో ముగ్గురి పేర్లను ఐసీసీ వెల్లడించింది.

పురుషుల విభాగంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, బంగ్లాదేశ్‌ ఆటగాడు నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో, ఐర్లాండ్‌ ప్లేయర్‌ హ్యారీ టెక్టార్‌ రేసులో ఉండగా.. మహిళల కేటగిరి నుంచి శ్రీలంక ప్లేయర్స్‌ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్‌ క్రికెటర్‌ థిపోట్చా పుత్తవాంగ్‌ నామినీస్‌గా ఉన్నారు. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓట్లు వేసి విజేతలను నిర్ణయిస్తారు. వచ్చే వారం విజేతలను ఐసీసీ ప్రకటిస్తుంది.

మే నెలలో నామినీస్‌ ప్రదర్శనలు..

  • బాబర్‌ ఆజమ్‌: న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 3, 4, 5 వన్డేల్లో 54, 107, 117 పరుగులు
  • నజ్ముల్‌ షాంటో: ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో 44, 117, 35 పరుగులు
  • హ్యారీ టెక్టార్‌: బంగ్లాదేశ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 21, 140, 45 పరుగులు

చదవండి: WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)