Breaking News

టాప్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్‌.. నాలుగో స్థానానికి ఎగబాకిన గిల్‌

Published on Wed, 08/23/2023 - 17:16

ఐసీసీ తాజాగా (ఆగస్ట్‌ 23) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి భారీ మార్పులు చోటు చేసుకోలేదు. వన్డే, టీ20, టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌ ప్లేస్‌లు యధాతథంగా కొనసాగుతున్నాయి. బ్యాటింగ్‌ విభాగం వన్డేల్లో బాబర్‌ ఆజమ్‌, టీ20ల్లో సూర్యకుమార్‌ యాదవ్‌, టెస్ట్‌ల్లో కేన్‌ విలియమ్సన్‌.. 

బౌలింగ్‌ విభాగం వన్డేల్లో జోష్‌ హాజిల్‌వుడ్‌, టెస్ట్‌ల్లో రవిచంద్రన్‌ అశ్విన్‌, టీ20ల్లో రషీద్‌ ఖాన్‌.. ఆల్‌రౌండర్ల విభాగం వన్డేల్లో, టీ20ల్లో షకీబ్‌, టెస్ట్‌ల్లో రవీంద్ర జడేజా అగ్రపీఠాలపై తమ స్థానాలను పదిలంగా కాపాడుకున్నారు. 

వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ మూడు స్థానాలు ఎగబాకి మూడో ప్లేస్‌కు చేరుకోగా.. వన్డే బ్యాటింగ్‌ విభాగంలో ఇమామ్‌ ఉల్‌ హాక్‌, శుభ్‌మన్‌ గిల్‌ చెరో స్థానం​ మెరుగుపర్చుకుని 3,4 స్థానాలకు చేరుకున్నారు. 

భారీ జంప్‌ కొట్టిన రుతురాజ్‌..
ఐర్లాండ్‌తో రెండో టీ20లో హాఫ్‌సెంచరీతో రాణించిన టీమిండియా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఏకంగా 143 స్థానాలు మెరుగుపర్చుకుని 87వ స్థానానికి ఎగబాకాడు. 

ర్యాంకింగ్స్‌ మెరుగుపర్చుకున్న బిష్ణోయ్‌, బుమ్రా
ఐర్లాండ్‌తో తొలి రెండు టీ20ల్లో రెండ్రెండు వికెట్లు పడగట్టిన బిష్ణోయ్‌, బుమ్రా తాజా టీ20 ర్యాంకింగ్స్‌ తమ స్థానాలను ఓ మోస్తరుగా మెరుగుపర్చుకున్నారు. బిష్ణోయ్‌ 17 స్థానాలు మెరుగుపర్చుకుని 65వ ప్లేస్‌కు.. బుమ్రా 7 స్థానాలు మెరుపర్చుకుని 84వ ప్లేస్‌కు ఎగబాకారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)