Breaking News

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు.. నంబర్‌ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్‌

Published on Wed, 03/22/2023 - 15:16

ఐసీసీ తాజాగా (మార్చి 22) విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు ఏర్పడింది. నంబర్‌ వన్‌ స్థానం కోసం కొత్త ఛాలెంజర్‌ రేసులోకి వచ్చాడు.  శ్రీలంకతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో సెంచరీ (121 నాటౌట్‌),  డబుల్‌ సెంచరీ (215) బాదిన న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ ఏకంగా 4 స్థానాలు ఎగబాకి సెకెండ్ ప్లేస్‌కు చేరుకున్నాడు.  

ఈ సిరీస్‌లో హ్యాట్రిక్‌ అర్ధసెంచరీలతో  (50, 89, 51) రాణించిన లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే 2 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్‌-10లోకి (10వ ర్యాంక్‌) చేరాడు. విలియమ్సన్‌ ఒక్కసారిగా నాలుగు స్థానాలు ఎగబాకడంతో స్టీవ్‌ స్మిత్‌ (3వ ర్యాంక్‌), జో రూట్‌ (4), బాబర్‌ ఆజమ్‌ (5), ట్రవిస్‌ హెడ్‌ (6) తలో స్థానం కోల్పోయారు. ఈ జాబితాలో ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాడు రిషబ్‌ పంత్‌ 9వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

గత వారం ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి పడిపోగా.. రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దినేశ్‌ చండీమాల్‌, ఇంగ్లండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ తలో 2 స్థానాలు మెరుగుపర్చుకుని 17, 18 స్థానాలకు ఎగబాకగా.. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 3 స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి చేరుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో కివీస్‌ మిడిలార్డర్‌ ఆటగాడు హెన్రీ నికోల్స్‌ అత్యధికంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ స్థానానికి చేరుకున్నాడు. లంకతో రెండో టెస్ట్‌లో విలియమ్సన్‌తో పాటు డబుల్‌ సెంచరీ (200 నాటౌట్‌) చేయడంతో నికోల్స్‌ ఒక్కసారిగా 20 స్థానాలు ఎగబాకాడు.   

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)