Breaking News

ఐసీసీ వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు

Published on Tue, 01/23/2024 - 14:55

2023 సంవత్సరపు అత్యుత్తమ వన్డే జట్టును ఐసీసీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారధిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. రోహిత్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ షమీ ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు.

వీరితో పాటు ఆసీస్‌ ఆటగాళ్లు ట్రవిస్‌ హెడ్‌, ఆడమ్‌ జంపా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో ఏకంగా ఎనిమిది మంది (భారత్‌ (6)+ ఆస్ట్రేలియా (2)) వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనలిస్ట్‌లకు చోటు దక్కడం విశేషం. మిగిలిన మూడు బెర్త్‌లను సౌతాఫ్రికా ఆటగాళ్లు హెన్రిచ్‌ క్లాసన్‌, మార్కో జన్సెన్‌, న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ దక్కించుకున్నాడు. 

ఐసీసీ వన్డే జట్టుకు ఓపెనర్లుగా రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌గా ట్రవిస్‌ హెడ్‌, నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లి, ఐదో ప్లేస్‌లో డారిల్‌ మిచెల్‌, వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా హెన్రిచ్‌ క్లాసెన్‌, ఆల్‌రౌండర్ కోటాలో మార్కో జన్సెన్‌, స్పిన్నర్లుగా జంపా, కుల్దీప్‌, పేసర్లుగా షమీ, సిరాజ్‌ ఎంపికయ్యారు. ఐసీసీ తమ అత్యుత్తమ వన్డే జట్టులో వన్డే వరల్డ్‌కప్‌ 2023 సెమీఫైనలిస్ట్‌లకు మాత్రమే చోటు కల్పించడం మరో విశేషం. 

ఇదిలా ఉంటే, ఐసీసీ నిన్ననే 2023 అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కూడా టీమిండియా ఆటగాడే సారధిగా ఎంపికయ్యాడు. విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, రవి భిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు సభ్యులుగా చోటు లభించింది. ఫిలిప్‌ సాల్ట్‌, నికోలస్‌ పూరన్‌, మార్క్‌ చాప్‌మన్‌, సికందర్‌ రజా, అల్పేష్‌ రంజనీ, మార్క్‌ అడైర్‌, రిచర్డ్‌ నగరవ సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)