Breaking News

Ind vs SL: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరిసిన కోహ్లి, రోహిత్‌..

Published on Wed, 01/11/2023 - 16:42

ICC Men's ODI Batting Rankings: టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. స్వదేశంలో శ్రీలంకతో తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ ఇద్దరు క్రికెటర్లు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. గువహటి మ్యాచ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు.

అద్భుత ఇన్నింగ్స్‌తో..
ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌గా వచ్చిన కోహ్లి.. 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 113 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో 45వ సెంచరీ, ఓవరాల్‌గా అంతర్జాతీయ కెరీర్‌లో 73వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రకటించిన వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లి రెండు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. రోహిత్‌ ఒక స్థానం మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా లంకతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)
రాసి వాన్‌ డెర్‌ డసెన్‌ (సౌతాఫ్రికా)
ఇమామ్‌ ఉల్‌ హక్‌(పాకిస్తాన్‌)
క్వింటన్‌ డి కాక్‌ (సౌతాఫ్రికా)
డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)

చదవండి: రంజీల్లో పృథ్వీ షా చరిత్ర.. నా రికార్డు బ్రేక్‌! థ్రిల్‌ అయ్యా.. ఎవరికీ అందనంత ఎత్తులో!
Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)