Breaking News

పొట్టి ప్రపంచకప్‌ రికార్డులు, విశేషాలు

Published on Tue, 02/03/2026 - 14:34

టీ20 ప్రపంచకప్‌ 10వ ఎడిషన్‌ భారత్‌, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీ తొలి ఎడిషన్‌ 2007లో ప్రారంభమైంది. 

నాడు ఈ టోర్నీ ICC World Twenty20 పేరుతో జరిగింది. 2018లో దీనిని ICC Men’s T20 World Cupగా పునర్నామకరణం చేశారు. 2007 నుంచి 2009 వరకు ప్రతి బేసి (ODD) సంవత్సరంలో, 2010 నుంచి ప్రతి జత (EVEN) సంవత్సరంలో ఈ టోర్నమెంట్‌ జరిగింది. 2018, 2020లో మాత్రం జరగలేదు.  

ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా భారత్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. ఈ మూడు జట్లు తలో రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. భారత్‌ 2007, 2024 ఎడిషన్లలో.. ఇంగ్లండ్‌ 2010, 2022లో.. వెస్టిండీస్‌ 2012, 2016 ఎడిషన్లలో ట్రోఫ్రీలు దక్కించుకున్నాయి. పాక్‌ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2022) తలోసారి ఛాంపియన్లుగా అవతరించాయి.

టోర్నీ చరిత్రలో అత్యుత్తమ రికార్డులు..
అత్యధిక ఎడిషన్లలో పాల్గొన్న ఆటగాళ్లు- రోహిత్‌ శర్మ, షకీబ్‌ అల్‌ హసన్‌ (9)
అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు- రోహిత్‌ శర్మ (47)
అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన రికార్డు- ఎంఎస్‌ ధోని (33 మ్యాచ్‌లు)
అత్యధిక పరుగులు- విరాట్‌ కోహ్లి (1292)
అత్యధిక వ్యక్తిగత స్కోర్‌- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123)
అత్యధిక సగటు- విరాట్‌ కోహ్లి (58.72)
అత్యధిక స్ట్రయిక్‌రేట్‌- సూర్యకుమార్‌ యాదవ్‌ (158.94 స్ట్రయిక్‌రేట్‌)
అత్యధిక సెంచరీలు- క్రిస్‌ గేల్‌ (2)
అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు- విరాట్‌ కోహ్లి (15)
అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు- విరాట్‌ కోహ్లీ (8)
ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి- యువరాజ్‌ సింగ్‌ (12)
ఫాస్టెస్ట్‌ సెంచరీ- క్రిస్‌ గేల్‌ (47)
అత్యధిక సిక్సర్లు- గేల్‌ (63)
అత్యధిక బౌండరీలు- రోహిత్‌ శర్మ (115)
ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- గేల్‌ (11)
ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు- గిబ్స్‌ (14)
ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్‌ కోహ్లి (2014లో 319 పరుగులు)

అత్యధిక వికెట్లు- షకీబ్‌ (50)
అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు- అజంత మెండిస్‌ (6-8)
అత్యుత్తమ ఎకానమీ- సునీల్‌ నరైన్‌ (5.17)
ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- అర్షదీప్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీ (2024లో తలో 17 వికెట్లు)
హ్యాట్రిక్‌లు- మొత్తం 9 (బ్రెట్‌ లీ, కర్టిస్‌ క్యాంఫర్‌, హసరంగ, రబాడ, కార్తిక్‌ మైయప్పన్‌, జోష్‌ లిటిల్‌, కమిన్స్‌, క్రిస్‌ జోర్డన్‌) నమోదు కాగా.. కమిన్స్‌ ఒక్కడే రెండు (2024) తీశాడు.
అత్యధిక క్యాచ్‌లు- డేవిడ్‌ వార్నర్‌ (25)

అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టు- శ్రీలంక (54)
అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టు- భారత్‌ (67.30)
అత్యధిక స్కోర్‌ చేసిన జట్టు- ఇంగ్లండ్‌ (2016లో సౌతాఫ్రికాపై 230-8)
అత్యల్ప స్కోర్‌ చేసిన జట్టు- నెదర్లాండ్స్‌ (39 ఆలౌట్‌, 2014లో శ్రీలంకపై)
అత్యధిక స్కోర్‌ నమోదైన మ్యాచ్‌- ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (2016లో 459 పరుగులు)
అత్యధిక మార్జిన్‌తో (పరుగులు) గెలిచిన జట్టు- శ్రీలంక (2007లో కెన్యాపై 172 పరుగుల తేడాతో)
అత్యధిక ఛేదన- ఇంగ్లండ్‌ (2016లో సౌతాఫ్రికాపై 230 పరుగులు)
అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్‌- డారెన్‌ సామీ (2012, 2016)

 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)