Breaking News

తప్పు సరిదిద్దుకున్న ఐసీసీ.. రీఎంట్రీ ఇచ్చిన రోహిత్‌, కోహ్లి

Published on Wed, 08/20/2025 - 18:28

ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఘోర తప్పిదం జరిగింది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండు, నాలుగు స్థానాల్లో ఉండిన టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి.. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌-100లో కూడా కనబడలేదు. ఈ ఇద్దరి పేర్లు ఆకస్మికంగా మాయం కావడంపై సోషల్‌మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్స్‌ నడుస్తుండగా ఐసీసీ స్పందించింది.

సాంకేతిక లోపం కారణంగా రోహిత్‌, కోహ్లి పేర్లు ర్యాంకింగ్స్‌లో కనబడలేదని వివరణ ఇచ్చింది. తప్పును సరి దిద్దుకుంటూ వారిద్దరి పేర్లను తిరిగి ర్యాంకింగ్స్‌ జాబితాలో చేర్చింది. అప్‌డేట్‌ చేసిన తర్వాత రోహిత్‌, కోహ్లి తమ పాత ర్యాంకులైన రెండు, నాలుగు స్థానాలను తిరిగి దక్కించుకున్నారు.

రోహిత్‌, కోహ్లి వన్డే ర్యాంకింగ్స్‌లో​కి రీఎంట్రీ ఇవ్వడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ర్యాంకింగ్స్‌లో కనపడకపోయే సరికి రోహిత్‌, కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించారని ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక లోపం కారణంగా తప్పిద​ం జరిగిందని తెలిసి రోహిత్‌, కోహ్లి అభిమానుల మనసులు కుదుటపడ్డాయి.

కాగా, సాంకేతిక లోపం కారణంగా తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరిన్ని తప్పిదాలు దొర్లాయి. రోహిత్‌, కోహ్లి పేర్లు మాయమైపోవడంతో పాటు పలువురు రిటైరైన ఆటగాళ్ల పేర్లు జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌, స్టీవ్‌ టికోలో, అలెక్స్‌ ఓబండ, థామస్‌ ఒడోయో, అన్షీ రథ్‌ లాంటి పేర్లు ఉన్నాయి. తప్పిదాన్ని గుర్తించిన తర్వాత ఐసీసీ వీరి పేర్లను తొలగించింది.

సవరించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ, బాబర్‌ ఆజమ్‌, విరాట్‌ కోహ్లి, డారిల్‌ మిచెల్‌, చరిత్‌ అసలంక, హ్యారీ టెక్టార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇబ్రహీం జద్రాన్‌, కుసాల్‌ మెండిస్‌ టాప్‌-10లో ఉన్నారు.  

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)