మేజర్‌ లీగ్‌ క్రికెట్‌కు లిస్ట్‌-ఏ హోదా

Published on Tue, 05/28/2024 - 17:47

అమెరికా వేదికగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌కు లిస్ట్‌-ఏ హోదా లభించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. లీగ్‌ రెండో ఎడిషన్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఐసీసీ నిర్ణయం వెలువడటంతో ఎంఎల్‌సీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (యూఏఈ) తర్వాత లిస్ట్‌-ఏ హోదా పొందిన రెండో అసోసియేట్‌ సభ్య దేశ లీగ్‌గా ఎంఎల్‌సీ గుర్తింపు దక్కించుకుంది. 

ఎంఎల్‌సీ రెండో సీజన్‌ ఈ ఏడాది జులై 5 నుంచి ప్రారంభంకానుంది. ఎంఎల్‌సీలో ఈసారి గత సీజన్‌ కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత సీజన్‌లో ఆరు జట్లు సింగిల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మట్‌లో మూడు వారాల పాటు 19 మ్యాచ్‌లు ఆడగా.. ఈ సీజన్‌లో అన్నే జట్లు గత సీజన్‌ కంటే 6 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడనున్నాయి. ఎంఎల్‌సీని మరికొద్ది సీజన్లలో 10 జట్ల లీగ్‌గా ఎక్స్‌ప్యాండ్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. 

ఎంఎల్‌సీలో బీసీసీఐ అనుబంధ ఆటగాళ్లు మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌కు తొలి సీజన్‌లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ లీగ్‌ను లిస్ట్‌-ఏ హోదా లభించడానికి ఇదీ ఒక కారణం. ఎంఎల్‌సీ అరంగేట్ర ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టుకు కీరన్‌ పోలార్డ్‌ నేతృత్వం వహించాడు. ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌తో పాటు లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, సీయాటిల్‌ ఆర్కాస్‌, టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌, వాషింగ్టన్‌ ఫ్రీడం ఎంఎల్‌సీలో మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. 

క్రికెట్‌లో లిస్ట్‌-ఏను వన్డే ఫార్మాట్‌ కింద పరిగణిస్తారు. అంతర్జాతీయ వన్డేలతో పాటు పలు దేశవాలీ టోర్నీలు కూడా ఈ జాబితా పరిధిలోకి వస్తాయి. లిస్ట్‌-ఏ పోటీలు గరిష్టంగా 8 గంటల పాటు సాగుతాయి. ఐసీసీచే అధికారికంగా వన్డే హోదా పొందని దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లిస్ట్‌-ఏ కిందికే వస్తాయి. ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌, టీ20 క్రికెట్‌తో పాటు లిస్ట్-ఏ క్రికెట్‌ ఐసీసీచే గుర్తించబడిన మూడు ప్రధాన ఫార్మాట్లలో ఒకటి.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)