Breaking News

IND vs AUS: సిడ్నీ పిచ్‌పై ఐసీసీ రేటింగ్‌..

Published on Thu, 01/09/2025 - 07:35

భారత్, ఆ్రస్టేలియా మధ్య ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’(Border Gavaskar Trophy)లో భాగంగా చివరి టెస్టు జరిగిన సిడ్నీ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సానుకూల నివేదిక ఇచ్చింది. ఈ పిచ్‌ను ‘సంతృప్తికరం’ అనే రేటింగ్‌ను ఇచ్చింది. సీమ్‌ బౌలింగ్‌కు విపరీతంగా స్పందించడంతో పాటు అనూహ్య బౌన్స్‌తో కనిపించిన ఈ పిచ్‌పై పేస్‌ బౌలర్లు చెలరేగారు. 

గ్రౌండ్స్‌మన్‌ ఈ టెస్టు కోసం కొత్త తరహా పచ్చికను ఉపయోగించారు. ఫలితంగా సిడ్నీలో తక్కువ సమయంలో ముగిసిన టెస్టుల జాబితాలో (బంతుల పరంగా) ఈ మ్యాచ్‌ మూడో స్థానంలో నిలిచింది. మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలు మాత్రమే నమోదయ్యాయి.

ఐసీసీ ఇచ్చిన నివేదిక వల్ల మున్ముందు ఇలాంటి ‘సంతృప్తికర’ పిచ్‌లను రూపొందించేందుకు తాము సిద్ధమవుతామని ఆ్రస్టేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) స్పందించింది. మరో వైపు తొలి నాలుగు టెస్టులు జరిగిన పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్‌ మైదానాలు ‘చాలా బాగున్నాయి’ అనే రేటింగ్‌తో ఐసీసీ కితాబునిచ్చింది.

సిడ్నీలో ఘోర ఓటమి.. 
కాగా ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భారత్‌ కోల్పోయింది. ఈ సిరీస్‌తో పాటు భారత్‌ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆశలు కూడా గల్లంతయ్యాయి.

పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్‌ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భారత్‌ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. బ్యాటింగ్‌ వైఫల్యం కారణం‍గానే టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది.

ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న విరాట్‌ కోహ్లి సైతం ఈసారి సత్తాచాటలేకపోయాడు. ఇక సిరీస్‌ ఓటమి అనంతరం భారత జట్టు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. అనంతరం జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్‌ సిరీస్‌లకు టీమిండియా సిద్దం కానుంది.
చదవండి: ‘అమెరికన్ల ఆటగా మార్చడమే లక్ష్యం’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)